... ఎవడెలా పుడతాడో?

వంశీ కలుగోట్ల// ... ఎవడెలా పుడతాడో? //
*************************************
మేమిద్దరమూ కలిసి సినిమాకెళ్ళాం

వాడికి ఆ హీరో సిగెరట్ తాగే తీరు నచ్చింది
నాకు ఆ హీరో చివర్లో ఇచ్చే సందేశం నచ్చింది 

ఇద్దరమూ క్రికెట్ మ్యాచ్ చూడటానికెళ్ళాం
మ్యాచ్ చూస్తుంటే వాడికి జాతీయత గుర్తొచ్చింది
నాకేమో మ్యాచ్ చూడటం సరదాకోసం అనిపించింది 

ఊరి చివర చెరువు గట్టు మీద కూచున్నాం
అక్కడికి బిందె పట్టుకుని వచ్చిన వాళ్ళని చూసి
వాడికి వర్గం, కట్టుబాట్లు గుర్తొచ్చాయి
నాకు వాళ్ళ దాహం కనిపించింది
...
...
...
ఒకే విషయం
వాడిని ఒకలా, నన్ను ఒకలా ఆలోచింపజేస్తుంది
వాడిలోంచి రాజకీయ నాయకుడు
నాలోంచి తిరుగుబాటుదారుడు పుట్టొచ్చు
వాడిలోంచి ఒక జాతీయవాది
నాలోంచి ఒక కవి/రచయిత పుట్టొచ్చు

ఎవడెప్పుడెలా పుడతాడో ఎవరికీ తెలుసు

Comments

Popular posts from this blog

నివాళి

విద్యార్థిగానే బతికితీరాలి

గమనం ...