దేవుడు అంతా చూస్తన్నాడు భయ్యా ...

వంశీ కలుగోట్ల// దేవుడు అంతా చూస్తన్నాడు భయ్యా ... //
********************************************************
భయ్యా, నీకు తెలుసో లేదో కానీ
ఈ మధ్యన దేవుడు ఫేస్ బుక్ లో ఆక్టివ్ గా ఉన్నాడు
వాట్స్ ఆప్ లో ఛాట్ చేస్తున్నాడు
సోషల్ మీడియాలో తెగ ట్రెండీ గా తయారవుతున్నాడు 

నీకు ఇంకా అనుమానంగా ఉంటే
ఒకసారి నీ ఫేస్ బుక్ లోకి వెళ్లి చూడు
ఎవడో ఒకడు ఏదో ఒక దేవుని బొమ్మ పెట్టి
దానికింద రాసుంటాడు చూసుకో
'అయిదు నిమిషాల్లో షేర్ చెయ్యకపోతే
నీకు అయిదు సంవత్సరాల దురదృష్టం' అని
మరింకేవడో ఇంకో బొమ్మ పెట్టి
'ఇదే అసలు దేవుడి బొమ్మ
వందమందికి షేర్ చెయ్యకపోతే నీ ఖర్మ' అని రాసుంటాడు 

దేవుడు చూస్తున్నాడు భయ్యా
తన ఫోటో లైకకపోయినా షేర్ చెయ్యకపోయినా
నీమానాన నిన్ను ఊరికే వదిలేస్తాడనుకుంటున్నావా
లెక్క పెట్టుకుంటున్నాడు తప్పులన్నీ
నీ ఖర్మ కాలి తగలడకముందే
గబాల్న షేర్ చేసి పడెయ్యి భయ్యా 

ఇంకోసారి ఫేస్ బుక్ ఓపెన్ చేసి చూడు
ఏనుగు తలకాయతోనో పంది శరీరంతోనో లేకపోతే
రెండు తలలు, నాలుగు కాళ్ళు/చేతులతో
ఒక విచిత్ర పిల్ల జీవి బొమ్మ పెట్టి
'ఇక కలియుగం సివరాఖరుకు వచ్చేసినట్టే
ఇదే బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం
మరింకేవరో ఊహించిన భయానక భవిష్యత్తు
ఈ బొమ్మని వెంటనే లైక్ చేసి
ఒక వంద మందికి షేర్ చెయ్యకపోతే
నీ బతుకు సంకనాకిపోయినట్టే' అని
మరింకో పోస్ట్ వేరెవడో పెట్టుంటాడు 

ఫేస్ బుక్ మాత్రమే కదా అని సంబరపడకు
నీ ఖర్మకాలి ఏ వాట్స్ ఆప్ లాంటి ఆప్స్ ఉపయోగిస్తోంటే
ఏదో ఒకరోజు శుభోదయ సమయాన
నీకొక మెసేజ్ వస్తుంది చూసుకో
తేడా ఏమీ లేదు మేటర్ సేమ్ టు సేమ్
కాకపోతే ఇక్కడ లైకడాలు ఉండవు కాబట్టి
'వెంటనే పాతిక మందికి షేర్ చెయ్యకపోతే
నువ్వు సంకనాకిపోతావు, సర్వనాశనం అవడం గ్యారంటీ
షేర్ చేసి అరగంటాగి చూసుకో నీకో శుభవార్త తెలుస్తుంది
అదృష్టం నీకు అంటుకుపోతుంది' అని
లెక్కలేనన్ని మెసేజెస్ వస్తూనే ఉంటాయి 

భయ్యా ఈ పోస్ట్ కూడా చదివిన వెంటనే
గబాల్న ఒక పదిమందికి షేర్ చెయ్యి
నీకు అంతా మంచే జరుగుతుంది :)


Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...