క్రికెట్ ...

వంశీ కలుగోట్ల// క్రికెట్ ... //
**************************
సి కె నాయుడు
సునీల్ గవాస్కర్
కపిల్ దేవ్
సచిన్ టెండూల్కర్
రాహుల్ ద్రవిడ్
సౌరభ్ గంగూలీ
మహేంద్ర సింగ్ ధోని
...
...
వీరి కులమేదో, ప్రాంతమేదో ఏనాడైనా పట్టించుకున్నారా
ఆటను చూసి అభిమానించారు
ఆరాధించి అగ్రపీఠం వేసి కూచోబెట్టారు
నేనేం చేశానని మధ్యలో నా మీద పడి ఏడుస్తున్నారు 
నాకోసం నాదంటూ ఏదైనా ఉందా
నేనున్నదే మీ ఆనందం కోసం కదా
వైపరీత్యాలు సంభవించినప్పుడు చారిటి మ్యాచ్ లు జరిపి
ఆ వచ్చిన డబ్బేదో సహాయకార్యక్రమాలకు ఉపయోగపడటానికి
కారణం నేనే కదా, నా మీద నీకున్న అభిమానమే కదా
నేను మంచికే ఉపయోగపడుతున్నాను కానీ ఏనాడూ చెడు తలపెట్టలేదే

నమ్మించి నట్టేట ముంచే నాయకుడిని
నీ కులానికి చెందినవాడని
నీ ప్రాంతం వాడని
నీకు నచ్చినవాడని చెప్పి
నెత్తికెక్కించుకుని ఊరేగుతావే
వాడు నిన్నూ, నీ భవిష్యత్తునూ
సర్వనాశనం చేస్తున్నా కూడా
చేష్టలుడిగి చూస్తావు కానీ
నన్ను మాత్రం ఆడిపోసుకుంటావు 

విభేదాలన్నీ మరచి
కనీసం ఒక్కరోజైనా మీలో అధిక శాతం మందిని
ఒక్కతాటిపై నిలిపి 'మనం' అనే భావన
కలిగించగలిగే శక్తి నాది మాత్రమే కదా
అయినా నామీద నీకెందుకంత ద్వేషం

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...