లోకం తీరు ...

వంశీ కలుగోట్ల// లోకం తీరు ... //
******************************
**
1
అలా ఇలా ఉంటుంది అని కవితలు రాసుకోవడం తప్ప
తీరం దాటని కెరటం అందం గురించి ఎవరికీ ఏమీ తెలీదు
ఉప్పెన కూల్చేసిన బతుకుల లెక్క మాత్రం
ప్రపంచానికంతటికీ తెలుస్తుంది, గుర్తుంటుంది

2
బెర్లిన్ గోడ పగిలినప్పుడు
ఎన్ని హృదయాలు ఉప్పొంగిపోయాయో తెలియదు
కానీ బెర్లిన్ విడగొట్ట బడినప్పుడు
పగిలిన హృదయాల లెక్క మాత్రం భూమి  పొరల అడుగున
భద్రంగా  పాతిపెట్టబడి ఉంది అని ప్రపంచానికి తెలుసు

3
అఖండ భారతదేశం అంటూ ఎవరేర్పరచారో
ఆ అఖండ దేశాన్ని ఎవరన్నా ఏకచ్చత్రాధిపత్యంగా
పాలించారేమో ఎవరికీ తెలియదు, గుర్తుండదు
ఆ అఖండ దేశాన్ని విడగొట్టినోళ్ళను మాత్రం ఎప్పటికీ మర్చిపోరు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...