మోక్షమార్గం ...
వంశీ కలుగోట్ల// మోక్షమార్గం ... //
*******************************
కసాయివాడంటే *******************************
కరుకుమనసున్న వాడు కాదు
అనుమానాలూ లేకుండా
... మహానుభావుడు
నువ్వు మొక్కే మహానుభావులు
నువ్వు పూజించే దూతలు
నువ్వు విశ్వసించే ప్రవచనకారులు
వాళ్ళంతా ముసుగేసుకున్న కసాయిలే
మోక్షం పొందే మార్గం చెపుతామని
మోసం మాత్రమే చేస్తారు
నీకు నిజంగా మోక్షం కావాలంటే
అంత దమ్మే కనుక ఉంటే
పో ... పోయి కసాయివాడి ఎదురుగా
బలిపీఠమ్ మీద తల ఉంచి చూడు
కసాయివాడు మోసం చెయ్యడు
వాడి చేతిలోని కత్తి గురితప్పదు
Comments
Post a Comment