ప్రళయమా ... ఉలికిపడు

వంశీ కలుగోట్ల// ప్రళయమా ... ఉలికిపడు//
***************************************
భయముండేది
ప్రళయమొస్తే ప్రపంచమేమవుతుందో అని 

వరద చూపిన భీభత్సాన్ని
ఉప్పెన సృష్టించిన ఉత్పాతాన్ని
భూకంపపు తీవ్రతలను
అగ్ని పర్వతపు లావాను
గ్రీష్మ తాపాన్ని
నీటి కొరతను
...
ఒకటా రెండా ఎన్నని లేక్కలేసేది
ఎదుర్కొంటూ
పోరాడుతూ
ఎదుగూ బొదుగూ లేని జీవితాలు
వ్యాపారం చేసే తెలివిమంతులు
రాజకీయం చేసే అవకాశవాదులు
...
...
ఎవడూ, ఏ ఒక్కడూ నాశనమవలేదు
ఇంతకుమించి ప్రళయమంటే ఏమిటో
ఆ ప్రళయమొచ్చి పీకడానికి ఏం మిగిలుందో
అందుకే ఎవడూ భయపడట్లేదు ఇక్కడ ...

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...