సూడు సిద్దప్పా ...

వంశీ కలుగోట్ల// సూడు సిద్దప్పా ...//
***********************************
1
సూడు సిద్దప్పా
ప్రపంచం నీగురించి మాట్లాడుకుంటే
పక్కింటోడు మూతి విరుస్తాడు
ప్రపంచం ఎప్పుడూ అంతే
ఎవడెప్పుడెలా ఎదుగుతున్నాడా అని గమనిస్తుంది
పక్కింటోడి తీరే అంత
తను తప్ప అందరూ ఎదుగుతున్నారని అసూయ

2
సూడు సిద్దప్పా
ప్రపంచానికి 
ఎదిగే ప్రతివాడూ
చుక్కాని లాగానో, ఊతకర్రలాగానో కనిపిస్తాడు
పక్కనోడికి మాత్రం ఆ ఎదుగుదల
తన అవకాశాలని దెబ్బతీసి
పైపైకి ఎదుగుతున్నట్టుగా ఉంటుంది

3
సూడు సిద్దప్పా
ఎక్కడి నీతి అక్కడ పాటించాలి అప్పా
నువ్వున్నసోటుకి ఆవు వచ్చిందనుకో
కావాలంటే దణ్ణం పెట్టుకో లేదంటే ఊరుకో
ఏమీ విపరీతం జరగదు
అదే పులి వచ్చిందనుకో కాలిసత్తువ కొద్దీ పరిగెత్తాల్సిందే
అలా కాదు అక్కడే కూసుంటాను అంటే
ప్రాణాలు పోతాయ్, పులి ఆవు లాంటిది కాదు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...