నవ్వుతూ ఉండిపో ...

వంశీ కలుగోట్ల// నవ్వుతూ ఉండిపో ... //
****************************************
నవ్వుతూ ఉండిపో ... నువ్వుగా మిగిలిపో
సిరిమువ్వకు మౌనం లేదు ... చిరునవ్వుకు మరణం లేదు
*                 *                *
నిజం చెప్పనా నేస్తం
చిత్రంగా నాకు ఏడుపు రావట్లేదు
విషాదం లేనే లేదు
నీ మౌనాన్ని తట్టుకోలేక
వెక్కిరిస్తూ కరిగిపోతోంది కాలం
ఇంతకాలం పక్కనలేనని కోపమా
ఏం చెయ్యను నేస్తం
ఆశల పోరులో మునిగిపోయాను
నీ స్నేహంలో సేద దీరదామని అనుకుంటే
నువ్వు నిష్క్రమించావు
నీ పరోక్షంలో విషాదాన్ని పలకరిద్దామని
ప్రతి చోటా వెదికా ...
విషాదం నీ దగ్గరే ఉంది
కానీ, పంచుకోవడానికి నీవు లేవు 

అయినా నువ్వెక్కడకెళతావు మమ్మల్ని కాదని
దిగంతాలకావల నువ్వున్నా
చిరుదివ్వెని వెలిగిస్తే మిణుగురువై రావా
అయినా మేం వెళ్లనిస్తేగా
చిరునవ్వుల రవ్వల్ని రువ్వుతూ
నీవైపోచ్చే చీకటిని పారదోలుతాం
*                 *                *
డియర్ కిట్టూ ...
నవ్వుతూ ఉండిపో, నువ్వుగా మిగిలిపో 


--- భాసర సరస్వతీ అమ్మవారి దర్సనానికానీ వెళ్లి గోదావరి నదిలో ఊబిలో కూరుకుపోయి ఆప్తమిత్రుడు రామకృష్ణ ఆకస్మికంగా మమ్మల్ని వదిలివెళ్ళిన (2001 వ సంవత్సరంలో) సందర్భంలో అక్షరాలుగా ఒలికిన బాధ

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...