... వాదానిదే విజయం
వంశీ కలుగోట్ల// ... వాదానిదే విజయం //
*************************************
*************************************
ఆలయపు గోడమీదో
మసీదు అరుగు మీదో
చర్చి మెట్ల మీదో కూచుని
వాడంటాడు
పురాతన వాదాలన్నీ ప్రతిబంధకాలే అని
వాడికింకా తెలిసినట్టు లేదు
ప్రభుత్వపు సహాయ పథకాలు
అందుకోవటానికి పనికిరాదని
వాడికింకా తెలిసినట్టు లేదు
శతాబ్దాల చరిత్ర సాక్షిగా
అనుభవించిన సమాజం
తిరగబడిన సమయంలో
త్రాసుమొగ్గులో తేడా వచ్చిందే కానీ
విజయం వాదాలదే అని
వాడికింకా తెలిసినట్టు లేదు
వాడికింకా తెలిసినట్టు లేదు
పురాతన వాదాలన్నిటికీ పాతరేసి
విజయం సాధించడమంటే
మేమిద్దరమూ ఒకే వైపు ఉండటమని
చరిత్ర మారుస్తామని చెబుతూ
చెరోవైపున నిలుచున్న మా ఇద్దరి లాంటోళ్ళను చూసి
పురాతన వాదాలన్నీ
విజయగర్వంతో నవ్వుకున్నాయి ...
Comments
Post a Comment