... ఆవేశాన్ని చూడాలనుకోకు

వంశీ కలుగోట్ల// ... ఆవేశాన్ని చూడాలనుకోకు //
**********************************************
ఏం నేను మనిషిని కాదనుకుంటున్నావా
లేక నాకు అలవాట్లు ఉండవనుకుంటున్నావా
నాకున్న అలవాట్లు మంచివో, చెడ్డవో
చెప్పడానికి నీవెవరని
కావాలంటే ప్లెబిసైట్ పెట్టుకొని చూసుకో
నా మాటలను, చేష్టలను
ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారో నీకే తెలుస్తుంది 


అయినా, మనది ప్రజాస్వామ్యమని నీకు తెలీదా
అంటే ఎక్కువమంది ఒప్పుకుంటే ఓకే అనే కదా
మరి అలాంటప్పుడు నీకెందుకు దూల 
చాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే
పోయి ప్రజాభిప్రాయ సేకరణ చేసుకో పో
నేను మాట్లాడినా
నేను సిగరెట్ తాగినా
అసలేం చేసినా
ప్రజల కోసమే, వారి ఆనందం కోసమే
ప్రజలకోసమే మేమున్నాం ...

నువ్వేదైనా అనుకో
కానీ, నేనూ మనిషినే అని గుర్తుంచుకో
నాకూ ఆవేశం వస్తుంది, దాన్ని చూడాలనుకోకు
నా ఆవేశాన్ని నువ్వు తట్టుకోలేవు, మాడిపోతావు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...