గోడలు ...
వంశీ కలుగోట్ల// గోడలు ... //
******************************
మిత్రమా ******************************
బహుశా నా రక్తం రుచి చూసి తీర్మానించాడు కాబోలు
లేక పుట్టుక ముందే నా బుద్ధెరిగిన మహా విద్వాంసుడెవడో
సర్టిఫికెట్టు ఇచ్చి ధృవీకరించాడేమో తెలియదు
నా వర్ణం, రక్తం అగ్రమని
మిత్రమా
నీ రక్తం, వర్ణం నిర్ధారించినవాడే
నా రక్తం, వర్ణం నిర్ధారించాడు
నికృష్టపు జాతి వెధవలు వాళ్ళంతా
వాడికి మనమధ్య స్నేహం నచ్చదు
నువ్వూ-నేనూ అన్న భావననుండి బయటపడి
వర్ణాల గోడలు బద్దలు కొట్టుకుని
'మనం'గా మారడం వాడికి(వాళ్లకి) ఇష్టం లేదు
ఎందుకంటే
అది వాడి ఆస్థిత్వానికే ముప్పు కాబట్టి
వాడి తంత్రానికి లోబడతావో
నీ బుద్ధికి పదునెడతావో నీ ఇష్టం
వాడి తంత్రానికి లోబడతావో
నీ బుద్ధికి పదునెడతావో నీ ఇష్టం
Comments
Post a Comment