నిప్పులు ...

వంశీ కలుగోట్ల// నిప్పులు ...//
******************************
యేబ్రాసి యెదవలందరూ
ముసుగులేసుకుని నీతులు వల్లిస్తున్నారు

రెండు ఆకర్షణల మధ్య
రాత్రి చీకట్ల పొరలలో 
నాలుగు గోడల లోపల 
నగ్నత్వం వారికి ఇష్టమే
కానీ, నిజాల పగటి వెలుగులో
భావాల నగ్నత్వాన్ని తట్టుకోలేక
నిలదీస్తున్నారు 

కులం పేరు చెప్పుకుని
తాతల గొప్పలు చెప్పుకుని
చేతిలో నోట్లు పట్టుకుని
ఎవరి తీరున వారు
తమ బతుకులను
కులానికో, ధనానికో
తాతల గొప్పలకో తగిలించి
ఊపుకుంటూ ఊరేగుతున్నారు
 
ముఖాలకున్న ముసుగులు తీస్తే కదా
ఒక్కొక్కడి వికృతత్వాలు బయటపడేది
వెలుగులో వేదం వల్లించి
చిత్తాన్ని చీకట్లో ప్రదర్శించుకునే నీచుల మధ్య
భావాలను నగ్నంగా ఎగరేస్తున్న
నన్ను చూసి, నిలదీస్తున్నారు 


అవును వాళ్ళందరూ నిప్పులే
బతుకులను కాలుస్తూ
భవితలను కాలరాస్తూ
ఎదుగుతున్నారు భాస్మాసురుల్లా

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...