వెలుతురు

వంశీ కలుగోట్ల// వెలుతురు ... //
********************************
 
అక్కడెక్కడో దూరంగా 
ఒక చిన్న వెలుతురు కనిపిస్తోంది
ఆ వెలుతురు 
ఏ మతపు దేవుడో 
ఏ వర్గపు ఆరాధ్యశక్తియో 
మరే కులపు జీవమో 
లేక ఇంకే నమ్మకపు ఆధారమో 
తెలియదు 

ఆ వెలుగును అందుకోవాలని 
పరిగెడుతున్నా 
నేను వెలుతురు కోసం పరిగెడుతున్నానో లేక 
వెలుతురు నన్ను చూసి పరిగెడుతోందో
తెలియటం లేదు
ఆ వెలుతురు ఎందుకు అందటంలేదో
అర్థం కావట్లేదు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...