అటాప్సి ...

వంశీ కలుగోట్ల// అటాప్సి ... //
***************************
ఇంతే భయ్యా ... ఈ లోకం తీరింతే
చచ్చినోడిపేరు చెప్పుకొని
బతికున్నోళ్ళు పండగ చేసుకుంటారిక్కడ 

ఎక్కడో ఎవడో పోయాడని
మరింకేక్కడో అసలేమాత్రం సంబంధం లేనోడిని
సావగొడతారిక్కడ 

బతకలేక చచ్చినోడికి
దండలేసి దణ్ణాలు పెట్టి హీరోని చేసి
ఉద్యమాలు చేసుకుంటారిక్కడ 

చచ్చినోడి సమాధి ముందు
కొవ్వొత్తులు వెలిగించి
బతికున్నోడి నోటికాడ ముద్దను
లాగేసుకుంటారిక్కడ 

పుట్టినప్పుడు మనిషి
పోయింతర్వాత మనిషి
మధ్యలో బతికున్నకాలమంతా
ఏదో ఒక కులపోడివిగానో
వర్గం/వర్ణం వాడివిగానో మాత్రమే
గుర్తింపబడతావు భయ్యా 
కాదని నువ్వు అన్నావంటే
నీకేదో మాయ రోగముందని
బతికున్నపుడే నీకు
అటాప్సి చేసేయ్యగలరు భయ్యో

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...