వాడంతే ...

వంశీ కలుగోట్ల // వాడంతే ... //
******************************
వాడేమీ సమాజానికీ

సంకుచితాలకూ బందీ కాడు 
భావోద్వేగాలకు బంధువూ కాడు 
కులమతాలకూ, రాజకీయాలకూ తొత్తు కాడు 
అందరూ కలిసి ఒక కంచె కట్టి
ఆ దడిలోనే వాడి భావాలను 
ఇమిడ్చి రాయమంటే ఎలా 
రాయకపోతే కవి కాదంటావా 

అయినా వాడేమీ ఇన్నాళ్ళూ 
నీ ఒప్పు కోసమో మెప్పు కోసమో రాయలేదు 
వాడిలో చలనం కలిగించే, బాధించే
సంఘటనేదో జరిగినపుడు
రాయాలనిపించే భావన కలిగినపుడు 
వాడే వాడికి తోచింది రాసుకుంటాడు 

నీకు నచ్చినట్టు రాయలేదని నిలదీస్తావెందుకు
తెలుసుకో/గుర్తు పెట్టుకో 
వాడెప్పుడూ నువ్వు మెచ్చేది రాయలేదు 
వాడు రాసింది నువ్వు మెచ్చావు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...