కొన్ని గొంతుకలు ...
వంశీ కలుగోట్ల// కొన్ని గొంతుకలు ... //
**************************************
1
ఏదో చేస్తున్నావని విన్నాను
చాలా మంచిపని చేస్తున్నావు
ఈ రోజుల్లో పదిమందికి మంచి చెయ్యాలని
ముందుకొచ్చే నీలాంటి వాళ్ళు ఎందరున్నారు చెప్పు
నీలాంటివాళ్ళను చూసినప్పుడు
మంచి జరుగుతుందని నమ్మకం వస్తోంది
******************************
1
ఏదో చేస్తున్నావని విన్నాను
చాలా మంచిపని చేస్తున్నావు
ఈ రోజుల్లో పదిమందికి మంచి చెయ్యాలని
ముందుకొచ్చే నీలాంటి వాళ్ళు ఎందరున్నారు చెప్పు
నీలాంటివాళ్ళను చూసినప్పుడు
మంచి జరుగుతుందని నమ్మకం వస్తోంది
అయినా ఇదేం సరిపోతుంది చెప్పు
చేసేది, చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది
నీ ఒక్కడి వల్లనో లేక నా వల్లనో అయ్యేపని కాదిది
అందుకే వదిలేశా
ఏదో ఉన్నన్నాళ్ళూ ఇంకోడికి సమస్య
కాకుండా బతికి పొతే చాలు
చేసేది, చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది
నీ ఒక్కడి వల్లనో లేక నా వల్లనో అయ్యేపని కాదిది
అందుకే వదిలేశా
ఏదో ఉన్నన్నాళ్ళూ ఇంకోడికి సమస్య
కాకుండా బతికి పొతే చాలు
2
ఆ ఏముందిలే ఏదో చేస్తున్నాడు
కడుపు నిండినోడు ఎంగిలి చేత్తో
కాసిని మెతుకులు రాలిస్తే అది కూడా గొప్పేనా
ఆ ఏముందిలే ఏదో చేస్తున్నాడు
కడుపు నిండినోడు ఎంగిలి చేత్తో
కాసిని మెతుకులు రాలిస్తే అది కూడా గొప్పేనా
అయినా ఏదో ఆశ లేకుండా ఎందుకు చేస్తాడు
రేపో కాకపొతే మాపో నాయకుడై
ఇంతకింతా దోచుకోవడానికే
ఇప్పుడీ చిల్లర సంతర్పణలు
రేపో కాకపొతే మాపో నాయకుడై
ఇంతకింతా దోచుకోవడానికే
ఇప్పుడీ చిల్లర సంతర్పణలు
3
ఇదిగో ఎందుకయ్యా నీకీ గోల
ఏదో కాస్త సంపాదించుకుంటున్నావు
పోయి నీ పనేదో నీవు చూసుకో ఈ గోలెందుకు చెప్పు
ఇదిగో ఎందుకయ్యా నీకీ గోల
ఏదో కాస్త సంపాదించుకుంటున్నావు
పోయి నీ పనేదో నీవు చూసుకో ఈ గోలెందుకు చెప్పు
నీకంటే ముందూ ఇలానే ఉంది
నీ తరువాత కూడా ఇలానే ఉంటుంది
తోలుమందం జనాలకు ఏమి చేసినా ఇంతే
పో పో పోయి నీ పని చూసుకో
నీ తరువాత కూడా ఇలానే ఉంటుంది
తోలుమందం జనాలకు ఏమి చేసినా ఇంతే
పో పో పోయి నీ పని చూసుకో
4
ఏందిరా భయ్ నీ ఎదవ సంత
పనిలేని ఎదవ ఎవడో ఏదో గొరిగినట్టు
నీకెందుకురా ఈ పంచాయతులు
తిన్నామా ఆఫీసుకు వెళ్ళామా
వీకెండ్ వస్తే తాగి ఎంజాయ్ చేసామా అన్నట్టుండాలి
జీవితం ఎంజాయ్ సేయ్యనీకి ఉందిరా
ఏందిరా భయ్ నీ ఎదవ సంత
పనిలేని ఎదవ ఎవడో ఏదో గొరిగినట్టు
నీకెందుకురా ఈ పంచాయతులు
తిన్నామా ఆఫీసుకు వెళ్ళామా
వీకెండ్ వస్తే తాగి ఎంజాయ్ చేసామా అన్నట్టుండాలి
జీవితం ఎంజాయ్ సేయ్యనీకి ఉందిరా
జీలో జిందగీ మేరె భాయ్
5
కొన్ని గొంతుకలు అంతే
ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాయి
కొన్ని చేతులూ అంతే
ప్రతి క్షణం సహాయం చెయ్యాలని తపిస్తూనే ఉంటాయి
పని చేస్తూనే ఉంటాయి
కొన్ని గొంతుకలు అంతే
ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాయి
కొన్ని చేతులూ అంతే
ప్రతి క్షణం సహాయం చెయ్యాలని తపిస్తూనే ఉంటాయి
పని చేస్తూనే ఉంటాయి
Comments
Post a Comment