కొన్ని గీతలు ...
వంశీ కలుగోట్ల // కొన్ని గీతలు ... //
********************************
చేతిలో ఆయుధాలతో
అటువైపు వాడు ******************************
చేతిలో ఆయుధాలతో
దుప్పటిలా మంచు కప్పేసినా
వరదై వాన నీరు ముంచెత్తినా
ఎడారి ఇసుక తుఫానులా కమ్మేసినా
ఆ గీత మా కళ్ళముందు కదలాడుతూనే ఉంటుంది
మా జీవితాలని వణికిస్తూనే ఉంటుంది
వాడికీ నాకూ మిత్రత్వమూ లేదు
శతృత్వమూ లేదు
మా వెనుక ఒక దేశం ఉందన్న ఆలోచన మా భుజాల మీద ఉందన్న భావన
వాడి వెనుక ఉన్నవారు
వాడి వెనుక ఉన్న దేశాన్ని/జాతిని
నా వెనుక ఉన్నవారు
నా వెనుక ఉన్నవారు
ఏదో చేస్తారనే ఊహతోనో
గతంలో ఎవరో చేసిన ఏదో ఘటన గుర్తోచ్చో
గీత దాటాలనుకుంటే
ఒకరినొకరం చంపుకుంటాం
వెనకున్న దేశపు జనాల సంతోషం/క్షేమం కోసం
అప్పటివరకూ భద్రంగా ఉండగాలిగామన్న సంతోషంతో
దేశపు జనాలు వెలిగించే కొవ్వొత్తుల కాంతుల్లో
బాధతో ఉన్న 'నా' వాళ్ళ కన్నీళ్లు వెలిగిపోతుంటాయి
ఆ గీతలు దాటాలని, చెరిపెయ్యాలని
మా ఇద్దరికీ అనిపిస్తుంటుంది
కానీ, అటువైపు ఇటువైపు
కొవ్వొత్తులు వెలిగించే జనాలు
రాజ్యమేలే నాయకులు
ఎప్పటికీ అడ్డుపడుతూనే ఉంటారు
Comments
Post a Comment