మాయదారి లోకం ...

వంశీ కలుగోట్ల // మాయదారి లోకం ...// 
*********************************************
1
తలెగరేసిన ప్రతివాడూ పొగరున్నోడు కాడు 
తల తెగనరికిన ప్రతివాడూ వీరుడు కాడు 

కాస్త గమనించి చూడు సోదరా 
తలెగరేసింది బహుశా మెడ పట్టేసి కావొచ్చు 
నరికిన తల ఏ కోడిదో కుక్కదో కావొచ్చు 

2
నువ్విలా నమ్మేస్తూ పోతుంటే 
నీది నీకే అమ్మెయ్యగలరు భయ్యా 
నిన్ను నీకే పరిచయం చేసి 
నీకు తెలీకుండా నీతోనే 
నీ డబ్బు ఖర్చు పెట్టించగలరు 

3
నా దగ్గరేముంది గోచి గుడ్డ అంటావేమో 
నీ శరీరంలో భాగాలన్నీ 
ఆస్థుల్లెక్కనే కనిపిస్తాయ్ ఈ యెదవలకు
జర జాగర్త భయ్యా 

4
భయ్యా సభలకెల్లి చప్పట్లు కొట్టటమంటే 
ఇంటి వసారాలో మంచం మీద కూకోని 
దోమలను సంపినట్టనుకుంటన్నావా 
సప్పట్లు కొట్టి ఇంటికోచ్చేసినాం అనుకుంటన్నవేమో 
నీకు తెలియకుండా నిన్ను తన వెనుక 
ఆస్థిని చేసుకుని అమ్మేసుకుంటున్నాడు 
నిన్ను తోక్కేస్తూ వాడు ఎదిగిపోతున్నాడు భయ్యా ... 

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...