వ్యతిరేకిస్తున్నా ...
వంశీ కలుగోట్ల// వ్యతిరేకిస్తున్నా ... //
************************************
నాకు నచ్చని విషయాన్ని ************************************
అదేదో వైకల్యంగా అంటున్నావని ఆగ్రహిస్తా
పాదయాత్రలో నా ప్రతి అడుగూ
ఒక ప్రభంజనమని నువ్వంటే
ఒక ప్రభంజనమని నువ్వంటే
నా అనుయాయిగా నిను గుర్తిస్తా
కానీ, నాది మామూలు నడకేనని అంటే మాత్రం
నువ్వు ప్రతిపక్షమేనని ఫిక్స్ అవుతా
నా ప్రతి మాటా ప్రవచనం లాంటిదని అంటే
నాకు భక్తుడిలాంటి వాడివనుకుంటా
కానీ నావి కేవలం గాలిమేడల కబుర్లని అంటే
నీ మూర్ఖత్వానికి తగిన శిక్ష అనుభవిస్తావు
నా ప్రతి చర్య లోకకల్యాణం కోసమేనని అనుకోగలిగితే
అర్థం చేసుకున్నావనుంటాను
నా లోకమంతా నా కులమే అంటే మాత్రం
ఇక నీకు పతనం తప్పదు
అసలు నీ దబాయింపు ఏంటి
నేను చెప్పిందే నిజం,నా మాటే వేదం
నేను చేసిందే మంచి
నేను చెప్పింది మాత్రమే నమ్మాలి
Comments
Post a Comment