వాడు మగాడురా ...
వంశీ కలుగోట్ల// వాడు మగాడురా ... //
************************************
ఒరేయ్ మగాడా నీ బతుకింతేరా
******************************
ఒరేయ్ మగాడా నీ బతుకింతేరా
అది అడ్డు పెట్టుకుని
కన్నీరు పెట్టుకోవాల్సిన కష్టాలను ఎన్నిటినో
దిగమింగి కుమిలిపోతున్నావు
ఎవరురా నువ్వే పెద్దని తీర్మానించింది
తప్పెవరు చేసినా
కుటుంబ పెద్ద నువ్వేనంటూ
బాధ్యుడిగా వేళ్ళన్నీ నీవైపే చూపుతాయి
తప్పెవరిదైనా సరేనువ్వే పవిత్రత నిరూపించుకోవాలి
నువ్వు చేసే పని ఏదైనా
నువ్వెక్కడివాడివైనా
కులమూ, గోత్రమూ, వర్గమూ ఏదైనా
నువ్వు 'మగాడి'వన్న ఒక్క కారణం చాలు 'తప్పు' నీదే అవ్వటానికి
నీ పవిత్రత నిరూపించుకోమని తీర్మానించటానికి
సినిమాల్లో సివరాఖరుకి న్యాయం గెలిచినట్టు
ఎప్పటికో ఒకప్పటికి
తప్పు నీది కాదని నీ పవిత్రత నిరూపితమైనా
నీ మీద పడ్డ ముద్ర చెరిగిపోదు
'మగాడు' కదా 'మేనేజ్' చేసుంటాడులే అంటారు
నీ బతుకంతా అంతే
కష్టాలన్నీ గుండె చప్పుడు వెనుకనో, విస్కీ గ్లాసులోనో
సిగరెట్ పోగలోనో దాచుకుంటూ
వాడికేం 'వాడు మగాడురా' అనిపించుకుని
'మేనేజ్' చేసుకుంటూ బతికెయ్యడమే
Comments
Post a Comment