నాయకులు పుట్టుకొస్తున్నారు ...
వంశీ కలుగోట్ల// నాయకులు పుట్టుకొస్తున్నారు... //
***********************************************
1
మౌనంగా ఉన్నన్నాళ్ళూ
అంతా బాగానే ఉంది
ఉన్నట్టుండి చెట్టుకొక నాలుక పుట్టుకొచ్చి
నోటికొచ్చినదంతా వాగి
మొదలుకే చేటు తెచ్చింది
******************************
1
మౌనంగా ఉన్నన్నాళ్ళూ
అంతా బాగానే ఉంది
ఉన్నట్టుండి చెట్టుకొక నాలుక పుట్టుకొచ్చి
నోటికొచ్చినదంతా వాగి
మొదలుకే చేటు తెచ్చింది
2
దిబ్బలోని పెంటకు
కొత్తగా బుద్ధి పుట్టుకొచ్చి
తానూ పెద్దమనిషినేనంది
పంచాయతీ చేస్తానని
పంచెఎగ్గట్టి బయలుదేరింది
పనిలేని ఎదవలంతా వెంటరాగా
నాయకత్వం చేస్తానని
ఊరేగడం మొదలుపెట్టింది
దిబ్బలోని పెంటకు
కొత్తగా బుద్ధి పుట్టుకొచ్చి
తానూ పెద్దమనిషినేనంది
పంచాయతీ చేస్తానని
పంచెఎగ్గట్టి బయలుదేరింది
పనిలేని ఎదవలంతా వెంటరాగా
నాయకత్వం చేస్తానని
ఊరేగడం మొదలుపెట్టింది
అంతకుమునుపు
రాయేస్తే చిట్లుతుందని దూరంగా ఉన్న
నీతిమంతులందరూ
తలా ఇంత పెంట పూసుకుని
తందాన తాళమేస్తూ గోల చేస్తున్నారు
రాయేస్తే చిట్లుతుందని దూరంగా ఉన్న
నీతిమంతులందరూ
తలా ఇంత పెంట పూసుకుని
తందాన తాళమేస్తూ గోల చేస్తున్నారు
3
లెక్కకు మిక్కిలిగా
నాయకులు పుట్టుకొస్తూనే ఉన్నారు
లెక్కకు మిక్కిలిగా
నాయకులు పుట్టుకొస్తూనే ఉన్నారు
నా తలలో వెంట్రుకలు
రాలిపోతూనే ఉన్నాయి
రాలిపోతూనే ఉన్నాయి
ఊడిన నా వెంట్రుకలన్నీ
నాయకులయ్యాయేమో
అని నా అనుమానం
నాయకులయ్యాయేమో
అని నా అనుమానం
Comments
Post a Comment