వాడేమవుతాడో ...

వంశీ కలుగోట్ల// వాడేమవుతాడో ...//
************************************
 
ఎప్పటినుంచో చూస్తున్నాను
వాడెప్పుడూ అంతే

అందరిలానే, అందరిలోనే ఉంటాడు
కానీ, లోలోపల రగిలిపోతుంటాడు 
ఏదో ఒకటి చెయ్యాలని తపిస్తుంటాడు
రాస్తానంటాడు, ఆడతానంటాడు
సినిమాలు తీస్తానంటాడు
రాజకీయాలు చేస్తానంటాడు
మరింకేదో సాధించాలని అంటాడు
ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు 

కలగా మిగిలిపోతాడో
కొంతమంది కన్నీటిచుక్కై రాలిపోతాడో
కొందరి ధైర్యమై నిలుస్తాడో 
నాయకుడై నడిపిస్తాడో 
స్ఫూర్తిని రగిలిస్తాడో
మరికొందరి భవిష్యత్తై నిలుస్తాడో
చివరకు వాడేమవుతాడో

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...