జయహో కవిత్వం ...
వంశీ కలుగోట్ల// జయహో కవిత్వం ... // ****************************** *********** అంతర్జాల ప్రపంచంలో ఏమీ తోచక అటూ ఇటూ తిరుగుతుంటే ఒక చెట్టు కనిపించింది ... ఫలవంతమైన ఎన్నో కొమ్మలు ఉన్న ఆ చెట్టుకింద కూచుందామని వెళితే ఒక్కొక్క కొమ్మ నుంచి ఒక్కో నవ కవి చేతిలోంచి జాలువారిన కవిత పలకరించింది ... * * * అతడి వైద్యం స్వస్థత చేకూరుస్తుందో లేక అతడి కవిత్వం పరవశింపజేస్తుందో అటు వైద్యం, ఇటు కవిత్వం - రెండింటితో స్వాంతన కలిగిస్తున్న విరించికి జయహో * * * తన స్మృతి పథంలోకి మననూ లాక్కెళ్ళి అప్పటి జీవితాల్లోని అమాయకత్వాన్ని, ఆవేదనలను భాషతో, యాసతో, రాత తీరుతో కట్టిపడేస్తున్న హెచ్చార్కెకి జయహో * * ...