భక్తి - వాదం

వంశీ కలుగోట్ల // భక్తి - వాదం //
***********************************
పాపము పెట్రేగెనని ఉగ్రముదాల్చి
ఫాలనేత్రముల్ రాల్చిన ప్రస్ఫులిత 
జ్వాలల కీలల విజృంభణతో
పర్వతమంత హిమమే కరిగి వరదై
ఊరూవాడలని ముంచెత్తినో ఏమో 
యని భక్తుడు వి'భ్రాంతి' చెంద 

కాదు యని వాడు తన వాదనతో వచ్చే
పుర్రెలోని బుద్దులు పెడతలలు పట్టగ
విశ్వరూపం దాల్చిన కాలుష్యపు
కోరలు సాచిన 'గ్లోబల్ వార్మింగ్'
అంటూ వాడు వివరించ యత్నించె 

దారులు వేరైననేమి గమ్యమొక్కటే
ఫాలనేత్రములో కానిచో కాలుష్యపు కోరలో
కాలుచున్న బతుకులెవ్వరివని యోచించక
వాదపు వాదరకిరువైపులనుంచుని
తలకొకరీతిన్ మేధావిత్వపు
వాచాలత్వమును ప్రదర్శించుచూ
కాలమును వృధా చేయుచునే యున్నారు 

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...