... నేను

వంశీ కలుగోట్ల // ... నేను //
****************************
1
నేనంటే ఏమిటని చెప్పుకోవడానికేమీ లేదు
గత కాలపు ఘన చరిత్రకు మొండిగోడలు సాక్ష్యంగా
మిగిలిపోయిన ఒక గ్రామానికి/దేశానికి చెందిన వాడిని
2
జ్ఞాపకాలలో మాత్రమే బ్రతుకుతూ
రోజులు గడిపే వృద్దుడిని కాను
మాటలు మాత్రమే చెప్పే మేధావిని కాను
వర్తమానంలో గతాన్ని పునరుజ్జీవింపజెయ్యాలి
అన్న ఒకే ఒక్క ఆలోచనతో
కలిసివచ్చిన కొందరితో
చేతనైన ఆచరణతో బతుకుతున్న మామూలోడిని
3
గతమంటే  యుద్దపు గాయాలు
వర్గపోరాటాలు మిగిల్చిన జ్ఞాపకాలు
మతాలు పంచిన మూర్ఖత్వాలు మాత్రమే
అని కొట్టిపడేసే మేధావుల/జ్ఞానుల మధ్యలో
నాలాంటి మామూలోడు అజ్ఞానే అవుతాడు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...