... ఎప్పటికీ ఉంటారు
వంశీ కలుగోట్ల // ... ఎప్పటికీ ఉంటారు //
****************************** *********
అన్నీ పంచుకోవాలి
అనుభవించి ఆస్వాదించాలి
నువ్వు నా దగ్గరనుండి
సంతోషం మూటగట్టుకెళ్ళాలి
*
నేను నీ తోడుగా ఉండాలి
కానీ, నేను లేకుండా కూడా
నువ్వు ఎదగాలి
*
నీకోసం నిలబడతాను
అనేది మాట కాదు
శ్వాసను నింపుకున్న దేహం
*
చెరువు గట్టో, సముద్రపు ఒడ్డో
గుడి వెనకో, సత్రం అరుగో
స్థలాలు మారుతుంటాయి
కానీ, స్నేహం మారదు
*
సాయంత్రాలు అనేవి
వస్తుంటాయి, పోతుంటాయి
కానీ, స్నేహితులు మాత్రం
ఎప్పటికీ ఉంటారు - మనలా
******************************
అన్నీ పంచుకోవాలి
అనుభవించి ఆస్వాదించాలి
నువ్వు నా దగ్గరనుండి
సంతోషం మూటగట్టుకెళ్ళాలి
*
నేను నీ తోడుగా ఉండాలి
కానీ, నేను లేకుండా కూడా
నువ్వు ఎదగాలి
*
నీకోసం నిలబడతాను
అనేది మాట కాదు
శ్వాసను నింపుకున్న దేహం
*
చెరువు గట్టో, సముద్రపు ఒడ్డో
గుడి వెనకో, సత్రం అరుగో
స్థలాలు మారుతుంటాయి
కానీ, స్నేహం మారదు
*
సాయంత్రాలు అనేవి
వస్తుంటాయి, పోతుంటాయి
కానీ, స్నేహితులు మాత్రం
ఎప్పటికీ ఉంటారు - మనలా
Comments
Post a Comment