... రంధ్రాన్వేషణ
వంశీ కలుగోట్ల // ... రంధ్రాన్వేషణ //
**********************************
పరిచిన గొంగళి మీద కూచుని
అన్నం తింటున్నారు వాళ్లిద్దరూ ******************************
పరిచిన గొంగళి మీద కూచుని
*
వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారు ...
ఏ దేవుడు చెప్పాడు వాడిని చంపమని
అని అడిగాడు వాడు
ఏ జంతువు అడిగింది తనను తినమని
ఎదురు ప్రశ్నించాడు వీడు
నీ ప్రార్థనాలయంలోకి
వాడినెందుకు రానివ్వట్లేదు
అని అడిగాడు వాడు
నీ ప్రార్థనాలయ ప్రవేశానికి
నీవెందుకు అన్ని నిబంధనలూ
అడ్డంకులూ పెట్టావు
అని అడిగాడు వీడు
నీ చరిత్ర అంతా
అహంకారపు అణచివేతలే
అన్నాడు వాడు
నీ చరిత్ర అంతా
విద్వేషపూరిత హత్యలే
అని వీడన్నాడు
...
...
...
...
...
...
ఒకటా రెండా ...
తిన్నది అరిగేదాకా ఇద్దరూ
ఒక్కొక్కరి తప్పులు/రంధ్రాలు
అన్వేషించుకుంటూనే ఉన్నారు
*
మళ్ళీ గొంగళి మీద కూచుని
అన్నం తింటున్నారు వాళ్లిద్దరూ
అన్నం తింటున్నారు వాళ్లిద్దరూ
వెంట్రుకలు వెతుక్కుంటూ
రంధ్రాన్వేషణకి సిద్ధమవుతూ ...
Comments
Post a Comment