... అబద్ధాలు


వంశీ కలుగోట్ల // ... అబద్ధాలు //
*****************************
1
నేనంటే ఒక అబద్ధం  ... అంతే
నిజమనుకునే ప్రతి ఒక్కరూ అబద్దమే
నిజమంటే ఒకటే - అదే అబద్ధం

2
ఏదో ఒక ముసుగేసుకుని
ఒకడు వెళ్లి ఇంకోడిని చంపుతుంటే
లేని నిజమెక్కడ బయటపడుతుందో అని
ఒక అబద్ధం ఇంకో అబద్దాన్ని
చంపి పాతరేస్తున్నట్టు అనిపిస్తుంది

3
పుస్తకాలలో రాసిన ధర్మసూత్రాలను
ఆదర్శంగా ఆచరిస్తున్నానని
స్వీయవంచన చేసుకుంటూ
బతుకీడుస్తున్న మహానటుల మధ్యన
మామూలోడిగా బతకడం ఎంత కష్టమో ...

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...