బతుకమ్మ పాట
ఎప్పుడో 2002/03 సంవత్సరంలో రాసిన బతుకమ్మ పాట ఇది. అప్పట్లో నల్గొండ
జిల్లాలోని కీసర, బొమ్మలరామారం దగ్గర్లో ఉన్న సాయిధామమ్ ఆశ్రమ పాఠశాలలో
తెలుగు మరియు గణిత అధ్యాపకుడిగా పనిచేసిన రోజుల్లో సహోద్యోగిని సుజాత గారి
అభ్యర్థన మేరకు, తాను ఇచ్చిన సమాచారం ఆధారంగా రాశాను. ఇందులో
తప్పులున్నాయని అనిపిస్తే చెప్పవలసిందిగా మనవి; అలాగే ఆ తప్పులకు
మన్నించమని కూడా. ఎందుకంటే నాకు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలతో పెద్దగా
పరిచయం లేదు, అప్పట్లో అక్కడి సహోద్యోగులు ఇచ్చిన సమాచారం, ప్రోత్సాహంతో
తెలిసిన వివరాలతో రాశాను. మరో విషయం - సుజాత టీచర్ గారి ఆధ్వర్యంలో ఈ పాట
సాయిధామమ్ ఉన్నత పాఠశాల తరగతి విద్యార్థినులు నృత్యరూపకంగా ప్రదర్శించి
మండలస్థాయి బహుమతి గెలుచుకున్నారు.
వంశీ కలుగోట్ల // బతుకమ్మ పాట //
******************************************
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
******************************
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
తల్లితండ్రుల కలల రూపంగా ఉయ్యాలో
గౌరమ్మ పుట్టింది ఉయ్యాలో
గౌరమ్మ వెలసింది ఉయ్యాలో
గౌరమ్మ ఎదిగింది ఉయ్యాలో
బడిలోన జేరింది ఉయ్యాలో
చదువు సంధ్యల్లోన తానే మేటి ఉయ్యాలో
చదువు సంధ్యల్లోన తానే సాటి ఉయ్యాలో
గౌరమ్మ ఎదిగే ఉయ్యాలో గౌరమ్మ ఎదిగే ఉయ్యాలో
చేత కలము బట్టి ఉయ్యాలో
కథలూ, కవితలూ రాసే ఉయ్యాలో
కరవాలము చేతబట్టి ఉయ్యాలో
కదనరంగమున ఉయ్యాలో
శత్రువులంతా ఉయ్యాలో
దునుమాడేనంటా ఉయ్యాలో
నాయకత్వం చేబట్టి ఉయ్యాలో
దేశాన్నేలేనంటా ఉయ్యాలో
ఊరూ వాడా ఉయ్యాలో
గౌరమ్మ విజయగాధలే ఉయ్యాలో
గగనం భువనం ఉయ్యాలో
గౌరమ్మ విజయాలే ఉయ్యాలో
గౌరమ్మ విజయాలే ఉయ్యాలో
గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో ఉయ్యాలో
అన్నింటా తానై ఉయ్యాలో
అందరి తల్లో నాలుకవోలె ఉయ్యాలో
జగన్మాతవోలె ఉయ్యాలోయ్యాలో ఉయ్యాలో
జగములనేలే ఉయ్యాలో
ఆదిశక్తిగా వెలిగే ఉయ్యాలో
మహిళా లోకానికి ఉయ్యాలో
మణికిరీటం మన గౌరమ్మ ఉయ్యాలో
మన్నూ మిన్నూ ఉండేదాకా ఉయ్యాలో
సూర్యచంద్రులు వెలిసేదాకా ఉయ్యాలో
బ్రతుకమ్మ బ్రతుకు ఉయ్యాలో
గౌరమ్మ గాథలు ఉయ్యాలో
బ్రతుకమ్మ బ్రతుకు ఉయ్యాలో
గౌరమ్మ చరితం ఉయ్యాలో
గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో
బ్రతుకమ్మ బ్రతుకు ఉయ్యాలో
తల్లితండ్రుల కలల రూపంగా ఉయ్యాలో
గౌరమ్మ పుట్టింది ఉయ్యాలో
గౌరమ్మ వెలసింది ఉయ్యాలో
గౌరమ్మ ఎదిగింది ఉయ్యాలో
బడిలోన జేరింది ఉయ్యాలో
చదువు సంధ్యల్లోన తానే మేటి ఉయ్యాలో
చదువు సంధ్యల్లోన తానే సాటి ఉయ్యాలో
గౌరమ్మ ఎదిగే ఉయ్యాలో గౌరమ్మ ఎదిగే ఉయ్యాలో
చేత కలము బట్టి ఉయ్యాలో
కథలూ, కవితలూ రాసే ఉయ్యాలో
కరవాలము చేతబట్టి ఉయ్యాలో
కదనరంగమున ఉయ్యాలో
శత్రువులంతా ఉయ్యాలో
దునుమాడేనంటా ఉయ్యాలో
నాయకత్వం చేబట్టి ఉయ్యాలో
దేశాన్నేలేనంటా ఉయ్యాలో
ఊరూ వాడా ఉయ్యాలో
గౌరమ్మ విజయగాధలే ఉయ్యాలో
గగనం భువనం ఉయ్యాలో
గౌరమ్మ విజయాలే ఉయ్యాలో
గౌరమ్మ విజయాలే ఉయ్యాలో
గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో ఉయ్యాలో
అన్నింటా తానై ఉయ్యాలో
అందరి తల్లో నాలుకవోలె ఉయ్యాలో
జగన్మాతవోలె ఉయ్యాలోయ్యాలో ఉయ్యాలో
జగములనేలే ఉయ్యాలో
ఆదిశక్తిగా వెలిగే ఉయ్యాలో
మహిళా లోకానికి ఉయ్యాలో
మణికిరీటం మన గౌరమ్మ ఉయ్యాలో
మన్నూ మిన్నూ ఉండేదాకా ఉయ్యాలో
సూర్యచంద్రులు వెలిసేదాకా ఉయ్యాలో
బ్రతుకమ్మ బ్రతుకు ఉయ్యాలో
గౌరమ్మ గాథలు ఉయ్యాలో
బ్రతుకమ్మ బ్రతుకు ఉయ్యాలో
గౌరమ్మ చరితం ఉయ్యాలో
గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో
బ్రతుకమ్మ బ్రతుకు ఉయ్యాలో
Comments
Post a Comment