... ఒంటరి
వంశీ కలుగోట్ల // ... ఒంటరి //
******************************
1
వాడన్నాడు గర్వంగా ...
'నా కత్తికొసన ప్రపంచాన్ని ఆడిస్తాను' అని
వాడన్నాడు గర్వంగా ...
'నా కత్తికొసన ప్రపంచాన్ని ఆడిస్తాను' అని
యుద్ధం ముగిశాక
శవాల కుప్ప మధ్యలో నిలబడ్డాక
కానీ, వాడికి అర్థమవ్వలేదు
శవాల కుప్ప మధ్యలో నిలబడ్డాక
కానీ, వాడికి అర్థమవ్వలేదు
కత్తికొస నుంచి జారుతున్న
రక్తపు చుక్కలు తప్ప
ఆడించడానికి కానీ
పాలించటానికి కానీ
మిగిలున్నదేమీ లేదని
విజయం అంచున
తానొంటరిగా నిలుచున్నానని
2
విజయం నిన్ను
ప్రపంచం ముందు నిలబెడుతుంది
ఒంటరిగా నువ్వు మిగిలిపోతావు
విజయం నిన్ను
ప్రపంచం ముందు నిలబెడుతుంది
ఒంటరిగా నువ్వు మిగిలిపోతావు
నీ వెనుక నిలబడ్డవాళ్లు
నీ భుజం తట్టి మెచ్చుకునేవాళ్ళు
నిన్ను బలిపీఠం పై నిలబెట్టేవారే
నీ భుజం తట్టి మెచ్చుకునేవాళ్ళు
నిన్ను బలిపీఠం పై నిలబెట్టేవారే
నీ విజయాన్ని చూసి
రొమ్ము విరుచుకుని
'ఎదో ఒకరోజు నేనూ సాధిస్తా'
అంటూ రంకెలేసేవారిని
దగ్గరకు తీసుకుని చెప్పు
'ఒంటరి కావటానికి సిద్ధమైతే ...'
శిఖరం అధిరోహించమని
రొమ్ము విరుచుకుని
'ఎదో ఒకరోజు నేనూ సాధిస్తా'
అంటూ రంకెలేసేవారిని
దగ్గరకు తీసుకుని చెప్పు
'ఒంటరి కావటానికి సిద్ధమైతే ...'
శిఖరం అధిరోహించమని
నువ్వు సాధించిన విజయాలు
గోడకు వేలాడుతుంటే
నువ్వు మాత్రం, ఒక మూలన
ఒంటరితనంలో కొట్టుకుపోతుంటావు
గోడకు వేలాడుతుంటే
నువ్వు మాత్రం, ఒక మూలన
ఒంటరితనంలో కొట్టుకుపోతుంటావు
(విజయం తరువాత వచ్చే సమస్యలను, ఒంటరితనాన్ని తట్టుకునేలా సిద్ధం కావాలని చెప్పడం మాత్రమే ఇక్కడ నా ఉద్దేశ్యం. విజయం అంటే బాధ్యతతో కూడిన ఆనందం. అందుకే యుద్ధం వల్ల వచ్చే విజయం, కృషి/పట్టుదలల వల్ల వచ్చే వ్యక్తిగత విజయం రెండింటి గురించి ప్రస్తావించాను)
Nice, true
ReplyDelete