... పోవాల్సింది నీ ప్రాణం కాదు

వంశీ కలుగోట్ల // ... పోవాల్సింది నీ ప్రాణం కాదు //
**********************************************
నీది మరణం త్యాగం కాదు
అవకాశవాదులకు ఊతమిచ్చే
... అసందర్భపు చావు

ప్రపంచానికి తిండి పెట్టే కష్టం నీది
ప్రకృతితో పోరాడిన చరిత్ర నీది
ఇవ్వాళ రాజకీయాలకు తలొంచుతున్నావా!

నీ అస్థిత్వానికి ముప్పు తెచ్చే
దార్శనికులు రాజ్యమేలుతున్న కాలమిది
నువ్వు వెన్ను చూపి వెళ్ళిపోతే
పోరాటం మాని నిష్క్రమిస్తే
నీకు భవిష్యత్తు లేకుండా చేస్తారు

నీవు లేకపోతే భవిష్యత్తే లేదని
పొలం లేకపోతే తిండే ఉండదని
అర్థం కాని నాయకులు
దార్శనికులుగా కొనియాడబడుతూ
అధికారం వెలగబెడుతున్నారిక్కడ

ఇటువంటి సమయంలో
నీవు వల్లకాదని నిష్క్రమిస్తే
పోరాటం ఆపి ప్రాణం వదిలేస్తే
భవిష్యత్తు అంతా అంధకారమే
నువ్వు మొదలైంది పోరాటంతో
నీకంటూ అంతముందంటే
అది పోరాటంతోనే కావాలి ...
బలవన్మరణంతో కాకూడదు 

పొలంలో కలుపును తియ్యటమే కాదు
సమాజంలో కుళ్ళును కడిగెయ్యటం కూడా
వ్యవసాయమే అవుతుంది ... 
రైతన్నా లే ... వ్యవసాయం మొదలెట్టు
పోలలోనో కాకపొతే సామాజంలోనో
కానీ, పోవాల్సింది నీ ప్రాణం కాదు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...