అనదర్ డే అనదర్ డాలర్
వంశీ కలుగోట్ల // అనదర్ డే అనదర్ డాలర్ //
****************************************
""" ఎప్పటిలానే
'అనదర్ డే అనదర్ డాలర్' అనుకుంటూ
ఆఫీసుకు వెళ్లాను ...
!!!!!!!!!!!!!!!!!!!!!! ... ఏమైంది ఇవాళ
కీబోర్డ్ లేదు, మౌస్ లేదు
మానిటర్ జాడే లేదు
సిపియు గురించి చెప్పక్కరలేదు
ఏ డెస్క్ మీదా ఏమీ లేవు
ఆఫీసు మొత్తం చూస్తే
ఉప్పెన ఊడ్చేసిన ఊరులా ఉంది
ఎవరో కనిపిస్తే
'ఏమయ్యింది' అని అడిగాను
'యంత్రాలకు స్వాతంత్య్రం ఇచ్చారు' అని చెప్పారు
ఇప్పుడెలా ... ఏమి చెయ్యాలి?
యంత్రం లేకపోతే బతికేదెలా?"""
...
...
...
అలారం శబ్దానికి మెలకువ వచ్చింది
కళ్ళు తెరచేసరికి వెలుతురు కమ్మేసింది
'హమ్మయ్యా ... అదంతా కలేనా
లేకపోతె యంత్రాలకు స్వాతంత్య్రం ఏంటి?'
అనుకుంటూ ఆ రోజుకి మొదలయ్యాను
Comments
Post a Comment