... నీడలు

వంశీ కలుగోట్ల // ... నీడలు //
**************************
నువ్వు కూచున్నది
చెట్టు కింద కాదు
పడగ నీడన 

రా, ఇజాల మాటున
వెలుతురు సోకని
నీడలు నీకెందుకు ?

నిజం నీడలా ఉండదు
నీరెండలా హాయినివ్వదు
మధ్యాహ్నపు ఎండలా
భగ భగ మండుతుంటుంది

నిజం తెలుసుకోవాలంటే
వెలుతురులోకి వెళ్ళటమొక్కటే దారి
ఆ దారికి దివిటీలు లేవు
మార్గదర్సకులూ లేరు 

ఎవరెన్ని పలుకులు పలికినా
ప్రతి ఇజమూ ఒక నీడే
ప్రతి మతమూ ఒక పడగే 

పడగల నీడల మాటున
రోజులు గడిపేస్తావో
నిజం కోసం నీడలను వదిలి
వెలుగువైపు సాగుతావో ...

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...