అసురుడెవ్వడు ...

వంశీ కలుగోట్ల // అసురుడెవ్వడు ... //
*************************************
 
నీ లోలోపల దాచి ఉంచిన అసురుడిని
పురాణాలలో వెతుకుతావెందుకు? 

ఎపుడో వేల సంవత్సరాల 
క్రితం ఎవరో రాసింది
నిజమో లేక కల్పనాచాతుర్యమో
సురుడెవ్వడు అసురుడెవ్వడు అంటూ
మీమాంస ఇప్పుడెందుకు?

మిత్రమా, ఇప్పుడు కావలసింది
అదంతా నిజమా లేక కల్పనా
సురుడెవ్వరు అసురుడెవ్వరు
అంటూ తీర్పులు కాదు
అసలుదే అబద్ధమన్నపుడు
అందులోని విషయాల గురించి
ఇక రచ్చ ఎందుకు 


ఆ పురాణాలు దాటొచ్చి చూడు
భూములు మింగుతున్న బకాసురులు
లక్షల కోట్లు సరిపోని వాతాపి ఇల్వలులు
భవిష్యత్తును మింగేస్తున్న రాహుకేతువులు
జీవితాలను నాశనం చేస్తున్న భస్మాసురులు
ఒకరా ఇద్దరా లెక్కకు మిక్కిలిగా
నీ చుట్టూ మనుతూనే ఉంటే 
వారందరినీ వదిలేసి
పురాణాల మీద పడ్డావేమిటి 

ఈనాటి అసురులు 
నీకంటూ భవిష్యత్తేమైనా మిగిలిస్తే
ఆ పురాణాల నిగ్గు 
ఎప్పటికైనా తేలగొట్టవచ్చు 

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...