... మేధావి

వంశీ కలుగోట్ల // ... మేధావి //
******************************
గొప్ప గొప్ప
పుస్తకాలన్నీచదివి
మేధావిత్వం ఒంటబట్టిన తరువాత
దేవుడు లేడని, ఉంటే ఒక్కడే అని
మతాలన్నీ మాయలే అని నేనున్నాను


ఎదురెళ్ళిన నన్ను చూసి
పామరుడొకడు 'నమస్కారం సామీ' అన్నాడు
మనిషిలో దేవుడిని చూడగలిగిన
ఆ పామరుడి అమాయకత్వం ముందు
దేవుడి తత్వంలో కూడా మంచిని చూడలేని
నా మేధావిత్వం వెలవెలబోయింది

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...