... సమాధానాలు Get link Facebook X Pinterest Email Other Apps July 26, 2016 వంశీ కలుగోట్ల // ... సమాధానాలు //************************************ ఎన్నిసార్లు ప్రేమిస్తావని అడిగాడు ఎన్ని ఉదయాలు నిద్రలేస్తావని అడిగితే ఏమని చెప్పాలి? చచ్చే రాత్రివరకూ ప్రతి ఉదయమూ మేలుకుంటూనే ఉంటాం కదా * * * ఎన్నిసార్లని పక్కవాడిని నమ్ముతావు తగిలిన వెన్నుపోట్లు చాల్లేదా అని అడిగాడు సముద్రపు ఒడ్డున కూచున్నప్పుడు ఎన్ని కెరటాలను లెక్కపెట్టావంటే ఏమని సమాధానం చెప్పాలి? పడిపోయిందని లెక్క పెట్టటం ఆపనా ఎగసిందని లెక్క పెడుతూనే ఉండనా * * * ఎన్ని రాతలని రాస్తావు ఎవడైనా మారాడా అని అడిగాడు మార్పు కోసం ఎన్ని పోరాటాలు జరగాలి అని అడిగితే ఏమని చెప్పాలి? మారేవరకూ పోరాటం ఆగదు కదా * * * హృదయంలోని భావాలను రసాయనాల త్రాసులో కొలిచేవాడికి ఆ భావ సంచలనాలేమి తెలుస్తాయి ఆ సమాధానాలేమి అర్థమవుతాయి Get link Facebook X Pinterest Email Other Apps Comments Unknown7 April 2019 at 19:31మారే వరకు పోరాటం ఆగదు.. మిత్రమా మీ కవితలు బావున్నాయి. శుభాషిసులతో. మైత్రేయ.9182174949.అనంతపురం.ReplyDeleteRepliesReplyAdd commentLoad more... Post a Comment
మారే వరకు పోరాటం ఆగదు.. మిత్రమా మీ కవితలు బావున్నాయి. శుభాషిసులతో. మైత్రేయ.9182174949.అనంతపురం.
ReplyDelete