... వెలుగుపువ్వు

వంశీ కలుగోట్ల // ... వెలుగుపువ్వు //
************************************
నువ్వెప్పుడూ కానరాని తీరానివే 
ఎంత పరిగెత్తినా చేరలేని గమ్యానివే 

నీ పరిచయం ప్రేమని పుట్టించింది 
నీ విరహం జ్వాలను రగిలించింది 
నీ ఊహ ఉత్తేజాన్ని నింపింది 
నువ్వు మాత్రం ఏమీ చేయకుండా 
అలా చూస్తూ వెళ్ళిపోతావు 

ఏమీ చెయ్యలేదని నీవంటావు 
చెయ్యకపోవడమేమిటి 
వెళుతూ వెళుతూ నువ్వు చూసే ఆ చూపు 
వీడ్కోలు చెప్పే నీ చెయ్యి 
'ఉంటానంటూ' వెళ్లిపోయే నీ రూపం 
నరనరాన నిండిపోయి నీ వైపే లాగుతూంటే 
ఏమీ చెయ్యకపోవటమేంటి 

ఒక్కో సాయంత్రాన్ని నువ్వు తీసుకెళ్తుంటే 
ఎన్ని ఉదయాలని మోసుకురమ్మంటావు 
వెన్నెలలన్నీ నీకిచ్చి అమావాస్య అయ్యాను 
ఇప్పుడు వెలుగు లేదని వద్దంటే ... ఎలా 
నీ నీడనయ్యాక నా వెలుగు ఇంకా ఇంకెక్కడుంది

ప్రేమని పుట్టించిన నీవే 
నిర్దాక్షిణ్యంగా చంపేస్తానంటే 
చంపేసి, ఒక వెన్నెలని నాటి పో
నీకోసం వెలుగు పువ్వై పూస్తాను ... 

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...