... దృష్టి

వంశీ కలుగోట్ల // ... దృష్టి //
***************************
దేశాలన్నీ తిరిగొచ్చాక
నేనన్నాను ప్రపంచం చిన్నది అని
ఇంటిబయట అరుగు మీద కూచుని
ఆకాశం చూసి వాడన్నాడు
అవును, ప్రపంచం చాలా చిన్నది అని
*                  *                  *
ఊరొదిలి పోయి, కష్టాలు పడి
ఒక ఉద్యోగం సంపాదించాక నేనున్నాను
బతకాలంటే పోరాడాలి అని
ఉన్న ఊర్లో వ్యవసాయం చేస్తూ
సాయంకాలం ఇంటికొచ్చాక వాడన్నాడు
అవును, బతకాలంటే కష్టపడాల్సిందే అని
*                  *                  *
సౌండ్ ప్రూఫ్ రూంలో కూచుని
ఇంస్ట్రుమెంటల్ మ్యూజిక్ వింటూ నేనన్నాను
సంగీతం ఒక అద్భుతం అని
గాలికి ఊగుతున్న పైరు సవ్వడి
చెట్లమీద పక్షుల కూతలు వింటూ వాడన్నాడు
అవును, సంగీతం అద్భుతం అని

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...