నువ్వెప్పుడూ అనూహ్యమే ...
వంశీ కలుగోట్ల // నువ్వెప్పుడూ అనూహ్యమే ... //
************************************************
తలుపు వెనకనుండి తొంగి చూస్తూ
కొంటె చూపులతో తడుముతావనుకున్నాను
బిగికౌగిలితో ఉక్కిరిబిక్కిరి చేస్తావనుకోలేదు
*
సిగ్గుతో ముద్దబంతిలా అవుతావనుకున్నాను
ఉత్సాహంతో ఎగసే ఉప్పెనవుతావనుకోలేదు
*
ఆలస్యానికి చిరాకుపడతావేమోననుకున్నాను
కానీ, చిరుముద్దుతో ఆహ్వానిస్తావనుకోలేదు
*
దూరంగా ఉండబోతున్నామంటే బాధనుకున్నాను
దగ్గరితనపు ఆనందాన్ని మోసుకొస్తావనుకోలేదు
*
నువ్వు నిజమేననుకుని అందుకోబోయాను
అందమైన ఊహవై దూరంగా వెళ్ళిపోయావు ...
*
పరిమితులకు లోబడిన నా ఆలోచనలకు
నీ ఊహ ... నువ్వు, ఎప్పుడూ అనూహ్యమే
******************************
తలుపు వెనకనుండి తొంగి చూస్తూ
కొంటె చూపులతో తడుముతావనుకున్నాను
బిగికౌగిలితో ఉక్కిరిబిక్కిరి చేస్తావనుకోలేదు
*
సిగ్గుతో ముద్దబంతిలా అవుతావనుకున్నాను
ఉత్సాహంతో ఎగసే ఉప్పెనవుతావనుకోలేదు
*
ఆలస్యానికి చిరాకుపడతావేమోననుకున్నాను
కానీ, చిరుముద్దుతో ఆహ్వానిస్తావనుకోలేదు
*
దూరంగా ఉండబోతున్నామంటే బాధనుకున్నాను
దగ్గరితనపు ఆనందాన్ని మోసుకొస్తావనుకోలేదు
*
నువ్వు నిజమేననుకుని అందుకోబోయాను
అందమైన ఊహవై దూరంగా వెళ్ళిపోయావు ...
*
పరిమితులకు లోబడిన నా ఆలోచనలకు
నీ ఊహ ... నువ్వు, ఎప్పుడూ అనూహ్యమే
Comments
Post a Comment