దృష్టి ...

వంశీ కలుగోట్ల// దృష్టి ... //
**************************
1
పోయిన ప్రాణమెవరిదో
ఎవరికీ పట్టట్లేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు 

ప్రాణం తీసిన తూటా పేల్చిన
తుపాకి వెనుక నిలబడి
మీట నొక్కినవాడి మతమేది అని తప్ప

2
నేరం చేసిన వాడి వయసూ
మనసు ఎదుగుదలా కాదు
జరిగిన నేరం వల్ల బాధ అనుభవించినవారి
వయసూ, మనసూ ఆధారంగా
శిక్ష వేసే రోజోస్తే బావుండు

3
నీవు ఊరు దాటి వస్తే
అది ఎదగటానికి ఒక ప్రయత్నం
ఇంకోడు దేశం దాటి వెళితే
మాతృభూమికి వెన్నుపోటు పొడవటం 

బ్రతకడానికి నువ్వు ఊరోదిలితే
బ్రతికించుకోవటానికి వాడు దేశం వదిలాడు
నువ్వోక్కడివైతే వాడో కుటుంబం

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...