వాడంటే ఒక చైతన్యం ...

వంశీ కలుగోట్ల// వాడంటే ఒక చైతన్యం ... //
*******************************************
తన గొంతు వినిపించాలనే
ప్రయత్నం కాదు వాడిది

గొంతెత్తి అరవలేని
ఏడవలేని
ప్రశ్నించలేని
వేలాది గొంతుకలకు
తన గొంతుక అరువిచ్చి
వినిపిస్తాడు

ఏమీ చెయ్యలేని నువ్వైనా
నిన్ను మోస్తూన్న నేలైనా
నిన్ను వాడుకునే నాయకుడైనా
ప్రపంచ దేశాలూ
పంచ భూతాలూ
ఎవరైనా ఏదైనా
వాడి అక్షరాల్లో ముక్కలుగా రాలి
కాగితం మీద పడాల్సిందే

తప్పెట మోతలకు పొంగిపోని
తుపాకి కాల్పులకు భయపడని వాడు
నీ చప్పట్లకు మురిసిపోతాడు

కవి అంటావో
రవి అంటావో
వాడి లక్ష్యం మాత్రం
నిన్ను నిద్దురలేపి
చైతన్యం సాధించటం
వాడు మామూలు మనిషి కాదు
ఒక్కొక్కడు ఒక చైతన్యం 

Comments

Popular posts from this blog

నివాళి

విద్యార్థిగానే బతికితీరాలి

గమనం ...