కొన్ని అక్షరాలు ...
వంశీ కలుగోట్ల// కొన్ని అక్షరాలు ... //
**********************************************
1
నేను చూసివచ్చిన జీవితంలోంచి
ఏరుకున్న జ్ఞాపకాలను
అక్షరాలుగా మలచి కథలో కవితలో
రాద్దామని అనుకుంటూంటాను
******************************
1
నేను చూసివచ్చిన జీవితంలోంచి
ఏరుకున్న జ్ఞాపకాలను
అక్షరాలుగా మలచి కథలో కవితలో
రాద్దామని అనుకుంటూంటాను
దిక్కు తోచని పరిస్థితుల్లో
బలవన్మరణానికి పాల్పడుతున్న
రైతో, భావి పౌరుడో, బలహీనుడో
ఎవడో ఒకడి గురించిన వార్త
ప్రతి ఉదయం నిద్దుర లేపుతుంటే
అవి అన్నీ పాత జ్ఞాపకాలను పాతరేసి
భావావేశాన్ని తట్టి లేపితే
ఆలోచనలు పక్కదారి ఎలా పడతాయి
బలవన్మరణానికి పాల్పడుతున్న
రైతో, భావి పౌరుడో, బలహీనుడో
ఎవడో ఒకడి గురించిన వార్త
ప్రతి ఉదయం నిద్దుర లేపుతుంటే
అవి అన్నీ పాత జ్ఞాపకాలను పాతరేసి
భావావేశాన్ని తట్టి లేపితే
ఆలోచనలు పక్కదారి ఎలా పడతాయి
ఏమేమో చెయ్యాలని అనుకుని
ఏమీ చెయ్యలేక బతుకుబండి లాగేస్తూ
జరుగుతున్నవి చూస్తోంటే
ఏమిటీ వైపరీత్యం అనుకుని
వదిలేసుకుని వదిలించుకుని వెళ్ళే
దారినపోయే దానయ్యలలో కలిసిపోవాలా
ఏమీ చెయ్యలేక బతుకుబండి లాగేస్తూ
జరుగుతున్నవి చూస్తోంటే
ఏమిటీ వైపరీత్యం అనుకుని
వదిలేసుకుని వదిలించుకుని వెళ్ళే
దారినపోయే దానయ్యలలో కలిసిపోవాలా
2
ఎన్ని సార్లు ఎంతమంది రాసినా
ఇంకా రాసి సాధించేది ఏముంది
రైతుల ఆత్మహత్యలు
ఇవ్వాళ మొదలైనవీ కావు
ఎన్ని సార్లు ఎంతమంది రాసినా
ఇంకా రాసి సాధించేది ఏముంది
రైతుల ఆత్మహత్యలు
ఇవ్వాళ మొదలైనవీ కావు
ఈ రాతలతో ఆగేవీ కావు
ఇంకేమీ సమస్యలే లేనట్టు
అక్కడికి నువ్వేదో కాడి పట్టి
అరక దున్ని వ్యవసాయం చేసినట్టు
ఇంకేమీ సమస్యలే లేనట్టు
అక్కడికి నువ్వేదో కాడి పట్టి
అరక దున్ని వ్యవసాయం చేసినట్టు
ప్రశ్నలు కుమ్మరించే గొంతుకలకు
ఉదయాన్ని పుట్టించాల్సిన అవసరం లేదు
ఆనందించటం తెలిస్తే చాలు అని
చెప్పటానికైనా అక్షరాలను మలచాలని
ఉదయాన్ని పుట్టించాల్సిన అవసరం లేదు
ఆనందించటం తెలిస్తే చాలు అని
చెప్పటానికైనా అక్షరాలను మలచాలని
3
ఎన్ని ప్రభుత్వాలు మారినా
పరిస్థితులు మారుతున్నాయా
ఎవడు అధికారంలో ఉంటే
వాడి కులపోడో, ప్రాంతమోడో
అంతో ఇంతో బాగు పడుతున్నారు
ఎన్ని ప్రభుత్వాలు మారినా
పరిస్థితులు మారుతున్నాయా
ఎవడు అధికారంలో ఉంటే
వాడి కులపోడో, ప్రాంతమోడో
అంతో ఇంతో బాగు పడుతున్నారు
అందుకే ఒక్కోసారి
ఒక్కో కులపోడికో, ప్రాంతపోడికో
అధికారం ఇస్తే
ఎప్పటికో అప్పటికి
అన్ని ప్రాంతాలు
అన్ని కులాలూ బాగుపడతాయి కదా
ఒక్కో కులపోడికో, ప్రాంతపోడికో
అధికారం ఇస్తే
ఎప్పటికో అప్పటికి
అన్ని ప్రాంతాలు
అన్ని కులాలూ బాగుపడతాయి కదా
4
ఏవో కొన్ని అక్షరాలు రాసి
ఏదో ఒక గోడ మీద పడేస్తే
ఏదో గొప్ప విషయం సాధించినట్టేనా
అక్షరాలు అలా గోడమీద
ఊరికే పడి ఉండవు
మనిషన్నోడిని కదిలిస్తాయి
చలనం రాకపోతే ఆ తప్పు
అక్షరాలదో రాతగాడిదో కాదు
జంతుత్వం వదిలించుకోని నీది
ఏవో కొన్ని అక్షరాలు రాసి
ఏదో ఒక గోడ మీద పడేస్తే
ఏదో గొప్ప విషయం సాధించినట్టేనా
అక్షరాలు అలా గోడమీద
ఊరికే పడి ఉండవు
మనిషన్నోడిని కదిలిస్తాయి
చలనం రాకపోతే ఆ తప్పు
అక్షరాలదో రాతగాడిదో కాదు
జంతుత్వం వదిలించుకోని నీది
Comments
Post a Comment