కొన్ని సందేహాలు ...
వంశీ కలుగోట్ల// కొన్ని సందేహాలు ... //
***************************************
ఎలా ...
కొన్నాళ్ళుగా కాదు కాదు కొన్నేళ్లుగా
వెంటాడుతున్న ప్రశ్నలు
1
రాయాలి ...
రాయాలి ...
కడుపు మండినప్పుడూ
ఆవేశం కలిగినప్పుడూ
పేజీలకొద్దీ భావాలు పుట్టుకొస్తూనే ఉంటాయి
వాటిని అక్షరాలుగా కాగితం మీద పెట్టినప్పుడు
ఏదో తెలియని సంశయం
చదివే వాడికి నచ్చుతుందా
అందంగా ఉందా, ఆనందించేలా ఉంటుందా అని
ఎప్పుడు రాసినా రాజకీయం గురించేనా అంటారని
ఏది రాసినా చివర్లో పరిష్కారం చెప్పటానికి ప్రయత్నిస్తావేంటి
అని ప్రశ్నిస్తారేమోనని
అని ప్రశ్నిస్తారేమోనని
ఎవరో నిర్దేశించిన చట్రంలో
నా రాతలు ఇమడట్లేదని తిరస్కరిస్తారేమోనని
ఎన్నో భయాలు ...
2
మనసుకు నచ్చింది చేస్తే
మరుసటి రోజుకు జీవితం ఎలా ఉంటుందోనని
డబ్బొచ్చే పని చెయ్యకపోతే
బ్రతుకు తీరు ఎలా ఉంటుందోనని
అడుగు అడుగుకూ అనుమానం
3
ఇన్నాళ్ళ, ఇన్నేళ్ళ పోరాటంలో
ఏదో ఒకటి సాధించే ఉంటానేమో
కానీ తృప్తి లేదు
కానీ తృప్తి లేదు
బహుశా సాధించినదేదీ తృప్తినిచ్చేది కాదేమో
నా వెంట వచ్చేది ఏదన్నా సాధించానా అని
ఇప్పుడే ఎలా తెలుస్తుంది
Comments
Post a Comment