మా ఊరి బస్సు ...

వంశీ కలుగోట్ల// మా ఊరి బస్సు ... //
*************************************
పట్టణంతో మా ఊరిని
ప్రతిరోజూ అనుసంధానించే
రాయబారి ఆ బస్సు

గమ్యం చేర్చటమే లక్ష్యంగా
బాధ్యత తెలిసిన ఆ బస్సు
బరువును నింపుకుని బయలుదేరుతోంది 

ప్రతిసారీలానే మళ్ళీ
నేను వీడ్కోలు పలుకుతున్నాను 

మనిషి మీద నమ్మకం లేకపోయినా
కాస్త ఆలస్యంగానైనా సరే
గమ్యం చేర్చుతుందని బస్సు మీద నమ్మకం 

ఎత్తూ-పల్లం, గాలీ-వానా చూసుకుని
అనువుగాని దారిపై అణిగి ఉండటం
తగిన దారిలో తనదైన రీతిలో దూసుకెళ్ళటం
తనవారని, తగనివారని పట్టింపులేమీ లేక
బరువేదైనా బాధ్యతగా గమ్యం చేర్చటమే  

ఎప్పుడూ పాఠాలు చెప్పదు
ప్రమాదాలు ఉంటాయి పక్కకు తప్పుకోమని
గొంతెత్తి అరవడం తప్ప (హార్న్)
అంతకుమించి పాటించి చూపుతుంది 

ఈ బస్సెప్పుడూ
నాకు ఆదర్శంగానే కనిపిస్తుంది

Comments

Popular posts from this blog

నివాళి

విద్యార్థిగానే బతికితీరాలి

గమనం ...