ఒక మనిషి పోయాడు ...

వంశీ కలుగోట్ల// ఒక మనిషి పోయాడు ... //
*****************************************
మామూలు మరణమో
బలవన్మరణమో కానీ
ఒకడు చనిపోయాడు

'ఒక మనిషి పోయాడు'
అని యే ఒక్కరైనా అంటారేమోనని
పరలోక ప్రయాణం ఆపుకుని మరీ
పోయిన వాడి ఆత్మ
ఆసక్తిగా ఆశతో ఎదురు చూస్తోంది


మతానికొకడు
పార్టీకొకడు వచ్చి
పోయినవాడు ఏదో ఒక మతం వాడో
మరింకేదో వర్గం వాడో అని
రాజకీయం చేస్తున్నారు తప్ప
పోయింది మనిషి అని గుర్తించట్లేదు 

ఉరితాడు మెడకు
బిగుసుకున్నప్పుడు కాదు
మనిషిగా గుర్తించలేదు అని
మళ్ళీ చచ్చేదారి లేక
పోయింది ఒక మతంవాడో
ఒక రాజకీయ వర్గం వాడో కాదు
'ఒక మనిషి పోయాడు' అని
గొంతెత్తి అరిచి చెప్పాలనున్నా
ఎవరికీ వినబడదని తెలిసి
బాధతో విలవిల్లాడుతోంది ఆత్మ

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...