సమాధానాల కోసం ...

వంశీ కలుగోట్ల// సమాధానాల కోసం ... //
******************************
***********
1
ఆఫీసు నుండి ఇంటికొచ్చాక జలుబు, తలనెప్పి
మైనస్ డిగ్రీల చలిలో
వణికించే గాలిలో కలిసే తిరినప్పుడు
మరోడికి రాని తలనెప్పి నాకే వచ్చిందంటే
నన్ను తాకిన గాలిదేకులమో తెలుసుకుని
ఈ వివక్షకు కారణమేమిటో కనుక్కోవాలనుంది

2
భూకంపం వచ్చిన ప్రాంతానికెళ్ళి
పగుళ్ళు విచ్చిన భూమిని చూసి
ఏ కులపోడిని కూల్చాలని చీలిందో
అగిది తెలుసుకోవాలనుంది 

3
వర్షం ముంచుకొచ్చి
సముద్రం పొంగి, వరదగా మారి
చెన్నై వాసిని సర్వం కోల్పోయి
సహాయం కోసం నిలబెట్టిన
నీటిది ఏ జాతో తెలుసుకోవాలనుంది

4
బడుగు రైతో
అన్యాయానికి గురైన అమ్మాయో
విసిగిన నిరుద్యోగో
దాష్టీకానికి బలైన పేదవాడో
కులాల సమరంలో కాలిపోయిన మేధావో
ఎవడైతేనేం ఉరితాడుకు
ఊపిరి తీసి శవంగా మార్చి
బతికి సాధించలేనిది
చచ్చి సాధించవచ్చేమో
అనే ఆశ కల్పించి మరీ చంపుతుంది

5
కోడిగుడ్డు మీద ఈకలు పీకేటోడు
బోడిగుండు మీద వెంట్రుకలు లెక్క పెట్టేవాడు
ప్రశ్నకు ప్రశ్నే సమాధానమనేవాడు
పరిశోధకుడు అయినప్పుడు
గోడమీది పిల్లివాటమే అయినపుడు
నిజమంటే ఒక అభిప్రాయమే కదా 

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...