రంగుల లోకం ...

వంశీ కలుగోట్ల// రంగుల లోకం ... //
**********************************
ఒరేయ్ పిచ్చోడా
ఇక్కడ ఇలానే జరుగుతుంది
దారుణం జరిగినా,దావానలం చెలరేగినా
మానభంగమైనా, మతోన్మాదమైనా
నీకు కనిపించేది నిజమో అబద్ధమో
నిర్ణయించుకునే హక్కు నీకు లేదు
రంగును బట్టే నిజం నిర్ణయించబడుతుంది

ఇదిగో ఇదిగిదిగో
ఈ కళ్ళద్దాల కుప్పలోంచి ఏదో ఒకటి తీసి పెట్టుకో
ఇది ఆ పార్టీది, అది ఇంకో పార్టీది
ఇదేమో ఆ మీడియా గ్రూప్ ది
అదేమో ఇంకో వర్గం మీడియా వాళ్ళది
నీకే రంగు నచ్చితే ఆ కళ్ళజోడు పెట్టుకో 

ఏదో ఒక కళ్ళజోడు తీసుకుని
కళ్ళకో, నెత్తికో ఎక్కడో ఒకచోట పెట్టుకుంటే
అప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడేది
కనీసం ఎవడికో ఒకడికి వినబడుతుంది 

నువ్వు పిచ్చోడివి కాదు మేధావివి
అని నిరూపించుకోవాలంటే
ఏదో ఒక కళ్ళజోడు పెట్టుకుని తీరాల్సిందే
కాదూ కూడదు అంటే
కనుమరుగైపోతావు జాగ్రత్త

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...