చావు పండగలు ...
వంశీ కలుగోట్ల// చావు పండగలు ...//
******************************************
అసలు రాతలు రాసిందే
చావులు ఆగాలని అయితే
ఎన్ని చావులకని
స్పందిస్తూ ఉండను
చచ్చే జనాలు అందరూ
ఏదో ఒక ఎన్నికలప్పుడో
ఎవడో ఒక నాయకుడు చచ్చినప్పుడో చస్తే
పరామర్శలూ ఓదార్పు యాత్రలూ ఎన్నో
రాజకీయాలకు చావులూ పండగలే
నీ చావు నీది మాత్రమే కాక
సంచలనం కావాలంటే
దేవుడిని అడుక్కునో, బలవంతంగానో
ఆ చావేదో ఎన్నికలప్పుడే చావు
లేదంటే నాయకుడితో పాటు చావు
Comments
Post a Comment