బోయీలు ...

వంశీ కలుగోట్ల// బోయీలు ... //
************************************
ఆనాడు అవతారమెత్తిన విష్ణువు 
వేదాలను, మనువుతో పాటు మరి కొందరిని కాపాడినప్పుడు 
ప్రళయంలో పతనమైంది అంతా సామాన్యులే 

సామాన్యుడు అంటే 
దేవుడికి కూడా అలుసేనని 
దేవుడికి కూడా పట్టనివాడు 
ఎప్పటికీ అనాధే  అని అవతారమెత్తి 
మరీ నిరూపించాడు

యుద్ధం జరిగిన ఏనాడైనా 
సైన్యం చచ్చిన తరువాతే సంధి కుదిరేది 
ఆలెగ్జాండర్ నుంచి సద్దామ్ హుస్సేన్ దాకా 
జగజ్జేతలైనా, నియంతలైనా
నియమితులైనా, నిపుణులైనా 
ముందు నిలబడ్డ సైన్యంలోని సామాన్యులంతా 
చచ్చిన తరువాతే చచ్చారు ... 

రాచరికాలు పోయినా రాజకీయాలు ఉన్నాయి 
రాజ్యాలు పోయినా ప్రజాస్వామ్యాలు పుట్టుకొచ్చాయి 
ఎన్ని మార్పులొచ్చినా 
ఆకాశం దాకా ఎగరగలిగేలా ఎదిగినా 
సామాన్యుడికి సమానత్వం మాత్రం లేదు 

తరాల తరబడి 
పల్లకీ ఉంటుందో ఉండదో తెలీదు 
కానీ తరాలు మారినా 
పల్లకీ మోసే బోయీలు మాత్రం ఉండాల్సిందే 
అది ఉత్సవ విగ్రహమైనా 
అధికారపీఠం మీది నాయకుడైనా 

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...