Posts

వెలుతురు ...

వంశీ కలుగోట్ల// వెలుతురు ... // ****************************** **** ప్రతి ఉదయం వెలుతురు వస్తూనే ఉంది నిద్దుర లేపేటందుకో చీకట్లు పారదోలేందుకో తెలీదు కానీ వచ్చీ రాగానే వెన్నుతట్టి నిలబెట్టి నిన్నంతా నింపుకున్న కల్మషాలని వదిలించుకుని మళ్ళీ ఇవాళ కొత్తగా అమృతత్వం వైపు అలుపెరగని పయనం చెయ్యటానికి కొత్త శక్తినిస్తూ పురిగొల్పుతోంది ప్రతి ఉదయం వెలుతురు వస్తూనే ఉంది మూసుకుపోయిన కళ్ళను తెరిపించి నిజాన్ని చూపించాలని మేదావిత్వపు పొరలు కమ్ముకుపోయి నిజాన్ని గుర్తించలేని అజ్ఞానిగా మిగిలిపోతుంటే ఆ పొరలు చీల్చి నిజం వైపు దారి చూపటానికి కిరణాలను పంపుతూనే ఉంది  ప్రతి ఉదయం వెలుతురు వస్తూనే ఉంది గొర్రెల మందలో  ఒకడా మేధావిత్వపు ముసుగు కప్పుకున్న మామూలోడా ఇప్పటికైనా కళ్ళు విప్పి వెలుతురు చూడు కళ్ళు మూసుకుంటే వెలుతురు పారిపోదు నువ్వు చీకటిని చూస్తావంతే

రెండోవైపు ...

వంశీ కలుగోట్ల// రెండోవైపు ... // ********************************   రెండో వైపు చూస్తే నీ కళ్ళు ఏమీ పోవు భూమి బద్దలవ్వదు ప్రపంచం ఉన్నట్టుండి అంతమవదు  కులాన్ని మతాన్ని మరచి ప్రాంతాల హద్దులు పక్కనపెట్టి ఎవరో చెప్పినది మరెవరో వ్యాఖ్యానించినది మూలన పెట్టి ఒకవైపే చూపించే ఒక వాదమే వినిపించే గొంతుకలను వినవద్దు రెండో వైపు చూడు నువ్వు ఇన్నాళ్ళూ చూడని ఆ రెండో వైపు ఉన్నది బహుశా 'నిజం' కావొచ్చు

'విప్లవ జ్యోతి' శ్రీ చంద్రశేఖర్ ఆజాద్

'విప్లవ జ్యోతి' శ్రీ చంద్రశేఖర్ ఆజాద్  ****************************************** మేఘమాలల గూల్చేడి మేరుపువోలె  ॥అహా॥ మేఘమాలల గూల్చేడి మేరుపువోలె కటిక చీకటి చెండాడు కాంతివోలె  పరాయి పాలన గూల్చేడి స్వాతంత్య్ర ప్రభనుబోలి  భారతభూమిని తోచే ఆజాదు నడక  ॥తందాన తాన॥  . . . . . . . . .  ఆంగ్లేయ ముష్కరుల గుండెల నిదురించిన సింహమురా ఆతడు ॥సై॥ స్వాతంత్రమే తన పేరని చెప్పిన మొనగాడురా ఆతడు ॥సై॥  మీసం మెలేసి సవాలు చేసిన  భళిర భళిర భళి భళి భళి  మీసం మెలేసి అరెరె మీసం మెలేసి  సవాలు చేసిన 'ఆజాదు'రా ఆతడు  . . .  . . .  . . .  ధీరునివోలె ఎదురు నిలిచెరా ॥సై॥ ధైర్యంతో దెబ్బల స్వీకరించెరా ॥సై॥ 'భారత మాతా కీ జై' యను మంత్రపఠనమే  ఆతని బాధను హరియించేనురా  ॥ హరియించెనురా॥  ॥తన్దాన తాన॥  . . .  . . .  . . .  ఊరూ వాడ ఈ గాఢ వినిరి ॥తం॥  వినినంతనే అచ్చెరువొందిరి ॥తం॥  ధీరబాలుని అభినందించ నిశ్చయించిరి ॥తం॥ అరెరె భళిర భళిర భళి భళి భళి  వీరుడ...

ఎవడు దేవుడు ఎవడు భక్తుడు ...

వంశీ కలుగోట్ల// ఎవడు దేవుడు ఎవడు భక్తుడు ...// ****************************** ***************** ధర్మాన్ని పాటించినవాడు ధర్మం పక్షాన నిలబడ్డవాడు  మానవత్వాన్ని నిలబెట్టినవాడు రక్తం చిందించి మంచిని గెలిపించినవాడు నిజాన్ని చెప్పినవాడు అందరూ దేవుళ్లయ్యారు ఒకనాడు దేవుడినే రక్షిస్తాననే వాడు  గోప్పోడవుతున్నాడు ఈ రోజు  సర్వహితం చెప్పే ధర్మాన్ని ఒకగాటన కట్టి  మతానికి ముడేసేవాడు  మానవత్వాన్ని మంటగలిపేవాడు  మహాత్ముడుగా కొనియాడబడుతున్నాడు  ఏ యజ్ఞంలో సమిధలుగా కాలిపోతున్నారో ఎవరెందుకు చంపుతున్నారో తెలీకుండానే హోటల్ లోనో, ధియేటర్ లోనో క్రీడా ప్రాంగణంలోనో, రోడ్డు మీదనో ఫ్రాన్స్, ఇరాక్, ఇరాన్ పాలస్తీనా, ఇజ్రాయెల్, సిరియా నేనున్నదో వేరే ఎవరో ఉన్నదో దేశం ఏదైతేనేం చిచ్చు ఒకటే మట్టిలో కలిసిపోతోంది మనుషులే ఆధిపత్యం కోసం జరుగుతున్న ఆటలో చెప్పుకోవడానికి వాదం ఏదైతేనేమి  ఉగ్రవాదం ఊపిరి తీస్తున్నపుడు దేవుడా రోజులు మారిపోయాయి నీ పేరు చెప్పుకుంటున్న భక్తులను చూసి మురిసిపోయి దిగి రావాలనుకుంటే నీదే మతమో తెలుసుకుని...

మనిషివే కదా స్పందించు ...

వంశీ కలుగోట్ల// మనిషివే కదా స్పందించు ...// ****************************** ********* నువ్వెళుతున్నప్పుడు రోడ్డు మీద మొరిగిన కుక్క  ఎన్నికలప్పుడు గోడ మీద ప్రచారపు రాతలు  ఉదయం నుంచీ బస్టాండులో ఎదురుచూసినా  సాయంకాలానికి కానీ రాని 'పల్లె వెలుగు' బస్సు  ఎన్ని వందల అడుగులు బోరు తవ్వినాపడని నీరు  ఎంతమందికి ఇచ్చినా తిరిగి రాని ప్రేమ  ఏదిరా నిన్ను ప్రభావితం చెయ్యటానికి నువ్వు కలం పట్టి కదనం చెయ్యటానికి అనర్హం  కష్టాలెన్నొచ్చినా ఎప్పటికీ రాని దేవుడు దేవుడి పేరు చెప్పి మనిషిని చంపే మృగాలు  బాధ్యతలు మరిచి హక్కుల కోసం పోరాడే పౌరుడు  ప్రతి వారాంతంలో బీరు తాగుతూ  దేశం భవిష్యత్తు గురించి బాధపడేవాడు  దూలానికి వేలాడుతున్న రైతు శవం  యాసిడ్ కాల్చిన మొహంతో అమ్మాయి  ఎవరైతేనేం నీ కలంనుంచి సిరాచుక్కగా రాలటానికి నిన్ను కదిలించటానికి మహా ప్రస్థానం కావాలా  మనిషివే కదా మరో మనిషి బాధ సరిపోదా

నా మౌనమా ...

వంశీ కలుగోట్ల// నా మౌనమా ... // ************************************* నీకు లేఖ రాద్దామని కూచున్నా  కానీ అక్షరాలూ జాలువారవేమీ కలం ముందుకు కదలదేమి  ఒక గొప్ప సందిగ్ధావస్థలో మునిగిపోయాను  ఏమని సంబోధిస్తూ ఉత్తరం ప్రారంభించను? ప్రియా అనా ప్రియతమా అనా  ఉహూ ఇవేమీ రుచించట్లేదు  నా భావాలకు ప్రతిరూపం నువ్వు నాలోని శూన్యాన్ని పూరించిన ప్రేమవు నువ్వు  కలం కాగితం తీసుకుని కూచున్నా  కానీ ఈ మౌనం నా మనసును కప్పేస్తోంది  నాలోని భావావేశాన్ని ఎగరేసుకుపోయింది  ఈ మౌనం నా మాటను మూగవోయింపజేసింది  ఇంకెలా ఇంకెన్నాళ్ళు భరించాలి ఈ భావావేశాలను  అక్షరం అక్షరం వెతుక్కుని  ఓర్పుతో కూచుని పేరుస్తూ  నా భావాలన్నిటినీ మూటగట్టి  ఈ ఉత్తరంలో ఒలకబోసుకుని  ఝేండాగా నీ ముందు ఎగరేస్తున్నా

నేను చెబితే నమ్ముతాడా ...

వంశీ కలుగోట్ల// నేను చెబితే నమ్ముతాడా ... // ****************************** **************** ఇవ్వాళ వాడిని ప్రశ్నిస్తున్నానని నేనేవరని అడుగుతున్నాడు  అయిదున్నర అడుగుల దేహాన్నని చెప్పనా  మూడున్నర అంగుళాల కలాన్నని చెప్పనా ఏదో ఒక ఇజం పేరు చెప్పుకుని  ఎవడో ఒకడి చంకనెక్కి తిరిగేది బహుశా వాడేమో  ఎవడికీ తలవంచని  సంకెళ్ళకు బెదరని అక్షరం లాంటోడిని నేను అహంకారంతో అంధత్వం కమ్మినవాడికి  కలంపోటుతో మేలుకోకపోతే  అసహనం ఉప్పెనలా కమ్మేస్తుందని  నేను చెబితే నమ్ముతాడా నెత్తికెక్కిన కళ్ళు నేలమీదికి దిగొచ్చేదాకా నమ్మి అందలమెక్కించిన ఓటే  వెన్నుపోటు పొడిస్తే కూలదోయగలదని నేను చెబితే నమ్ముతాడా వాడు  నరనరాన నిండిన వంచకత్వంపై  సామాన్యుడి ఓటు పోటు పడేదాకా